తలసేమియా వ్యాధి బాధితులకు సహాయం చేయడానికి హృదయం ఫౌండేషన్ నిర్వాహకులు ముందుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, సోంపేట మండల కేంద్రాల్లో హృదయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా బాధితుల దత్తత కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు. ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని పిరియా సాయిరాజ్‌తో కలసి ప్రారంభించారు.
తలసేమియా బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని మంత్రి అన్నారు. రోటరీ తరహా స్వచ్ఛంద సంస్థ ముందుకొస్తే సోంపేటలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కర్రి మిన్నారావు, సలహాదారులు వై.క్రిష్ణమూర్తి, సత్యరాజ్, రామారావు, శ్రీనివాసరావు, సర్పంచి నగిరి ప్రభావతి, మెట్ట రామారావు తదితరులు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మిన్నారావు తల్లిని ఘనంగా సన్మానించారు.
ఇదీ చూడండి: