శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై జీజీహెచ్‌లో మంత్రి అప్పలరాజు సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 17వందల కొవిడ్ బెడ్స్‌తో పాటు 15 వందల క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. కేసులు పెరగకముందే ముందస్తుగా జిల్లావ్యాప్తంగా కనీసం 2 వేల కొవిడ్ బెడ్స్, 3 వేల క్వారంటైన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పేషెంట్లకు 24 గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
కొవిడ్ మెుదటి దశ వ్యాప్తి సమయంలో వైద్యులు అందించిన సేవలు చిరస్మరణీయమన్న మంత్రి..అదే స్ఫూర్తితో ఇప్పుడు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం కేసులు, వారికి అందుతున్న వైద్యం, ప్రస్తుత పరిస్థితి, మెరుగుపడిన వారి వివరాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీచదవండి