మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారన్న నమ్మకముందని మంత్రి అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి... రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం తీసుకొన్న నిర్ణయాలు తెలుసుకొని మాట్లాడాలని వైకాపా అదినేత జగన్‌కు సూచించారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లోనే బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించిన విషయం గుర్తుచేశారు. 139 కులాలకు కొర్పొరేషన్లు ఏర్పాటు చేశామన్న అచ్చెన్నాయుడు... రూ.42 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.