శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రం వద్ద వలస కార్మికులు ఆందోళనకు దిగారు. పునరావాస కేంద్రం నుంచి ఇప్పటికే 100 మందికి పైగా ఇళ్లకు పంపారని, తమకు కరోనా పరీక్షలు పూర్తి చేసినా, ఫలితాలు ఇంకా రాలేదని అధికారులు చెబుతున్నారని వారు తెలిపారు. 21 రోజులు గడిచినా తమను ఇంకా ఇంటికి పంపించకపోవడం దారుణమన్నారు.
నిర్లక్ష్యంతోనే తమను కేంద్రంలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సుమారు 56 మంది కార్మికులు... చిన్నపిల్లలతో సహా కళాశాల రోడ్డు పైకి వచ్చారు. తమ సామగ్రి చేతబూని ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పరిస్థితి విషమించగా... పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని కోవిడ్ పరీక్ష ఫలితాలు త్వరగా వచ్చేందుకు కృషి చేస్తున్నామని వారికి నచ్చచెప్పారు.
ఇవీ చూడండి: