కడుపు నింపుకోవడానికి...కుటుంబాన్ని పోషించుకోవడానికి...కానరాని ప్రాంతాలకు వలస వచ్చిన కూలీల అవస్థలు అన్ని ఇన్నీ కావు. రెక్కలు ముక్కలు చేసుకుంటే కానీ కడుపు నిండని వలస కూలీలు... కరోనా దెబ్బకు ఇంటి బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో చిక్కుకున్న వలస కూలీలు వందలాదిగా ఒడిశాలోని తమ ప్రాంతాలకు వివిధ మార్గాలలో ఇంటికి చేరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి టోల్ ప్లాజా మీదుగా ఒడిశాకు ప్రయాణం చేస్తున్నారు.
ఇదీచూడండి. 'ఇంటి తలుపులు తెరిచే ఉంచాలి'