శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మేడే సందర్భంగా సీఐటీయూ నాయకులు కార్మిక జెండా ఎగురవేశారు. ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని పౌర హక్కుల సంఘం నాయకులు బొడ్డేపల్లి మోహన్రావు అన్నారు. కార్మిక హక్కుల రక్షణకు సమష్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. కరోనా కారణంగా మూసేసిన కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనం అందించాలని కోరారు. ఒకవేళ ఎవరినైనా తొలగిస్తే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ఆదినారాయణ, ఎర్రయ్య, మహిళా సంఘం నాయకురాలు కనకమహాలక్ష్మి, ఇతర కార్మికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..