ETV Bharat / state

డబ్బులిచ్చి మాస్​ కాపీయింగ్​.. ఎక్కడంటే..! - ఇన్విజిలేటర్స్ కోఆర్డినేటర్లు మాస్ కాపీకి సహకరణ

Mass Copying : పరీక్షలంటే ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చూడకుండా రాయాలి. విద్యార్థులెవరూ కాపీయింగ్​ చేయకుండా ఇన్విజిలేటర్లు చూడాలి. ఎవరైనా కాపీ చేస్తే బహిష్కరించాలి.. కానీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో జరుగుతున్న దూరవిద్య పరీక్షలో విద్యార్థులు పుస్తకాలు, సెల్​ఫోన్లు పెట్టుకుని మరీ కాపీయింగ్​కు పాల్పడ్డారు. పరీక్షాకేంద్రానికి వెళ్లిన ఈటీవీ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. అయితే నిర్వాహకులే ఫీజులు వసూలు చేసి మరీ కాపీయింగ్​కు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

copying
మాస్ కాపీయింగ్
author img

By

Published : Jan 5, 2023, 5:51 PM IST

Mass Copying : ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు పుస్తకాలు, సెల్​ఫోన్లు ముందు పెట్టుకొని పరీక్ష రాస్తుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది. డిసెంబర్ 28 నుంచి ఈ పరీక్షలు జరుగుతున్నాయి. గురువారం మైక్రో ఎకనామిక్స్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో.. ఈటీవీ అక్కడి పరిస్థితులను పరిశీలనకు వెళ్లగా.. విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, మరి కొంతమంది సెల్​ఫోన్​లో జవాబులు చూస్తూ పరీక్ష రాస్తున్నారు. కాగా ఈ తతంగం అంతా ఈటీవీ కెమెరాకు చిక్కింది.

ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య పరీక్షల్లో మాస్ కాపీయింగ్

వెంటనే తేరుకున్న అభ్యర్థులు పాఠ్య పుస్తకాలను, సెల్​ఫోన్లను టేబుల్ కింద దాచే ప్రయత్నం చేశారు. ఒకే గదిలో 60 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా.. వీరికి ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వాహకులు కిటికీ తలుపులు వేసి మరీ ప్రోత్సహించడం మరింత విడ్డూరం. దీనికోసం హెల్పింగ్ ఫీజులు పేరుతో అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.