కరోనా మహమ్మారి ఎప్పుడు ఎలా చుట్టుముడుతుందో తెలియదు. నిన్న మొన్నటివరకు కరోనా రహితంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున అందజేయాలని సిక్కోలు యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు మెప్మా, డీఆర్‌డీఏ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించి తద్వారా చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో ప్రజలందరికీ లక్షల కొద్దీ మాస్కులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మాస్కుల తయారీని పట్టణ పరిధిలో మెప్మా.... గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి డీఆర్‌డీఏ పర్యవేక్షిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన పట్టణాల్లో పురపాలక సంఘాల కమిషనర్లకు మండలాల పరిధిలో ఎంపీడీవోలకు మాస్కులు పంపిణీ చేస్తున్నారు. వీటిని వాలంటీర్ల ద్వారా ప్రజలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత అప్పగించారు. జిల్లాలో ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన స్వయం శక్తి సంఘాల మహిళలు మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులు వేసుకోకుండా బయట తిరుగిన వారికి రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: ఇక జిల్లాలోనే కరోనా నిర్ధరణ పరీక్షలు