BAHAVANAPADU PORT : భావనపాడు పోర్టుకు.. వచ్చే ఏడాది మార్చిలో శంకుస్థాపన చేయాలని రాష్ట్ర మారిటైం బోర్డు భావిస్తోంది. ఇందులో భాగంగా పోర్టు నిర్మాణానికి సేకరించిన భూముల యజమానులకు పరిహారం చెల్లింపును వచ్చే వారంలో ప్రారంభించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణానికి దాదాపు వెయ్యి ఎకరాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇందులో మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 420మంది రైతులకు చెందిన 320 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు.
ఉప్పు తయారీ జీవనాధారంగా ఉన్న కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయమై వారితో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. వారి నుంచి 240 ఎకరాలను సేకరించాలి. ఈలోగా శంకుస్థాపన పనులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలను మారిటైం బోర్డు చేపట్టింది. వాటితోపాటు ప్రభుత్వ భూములు 237 ఎకరాలు, తీరప్రాంత భూములు 121 ఎకరాలు, అటవీశాఖ భూములు 3 ఎకరాలను అధికారులు ఇప్పటికే పోర్టు నిర్మాణానికి తీసుకున్నారు.
ఇవీ చదవండి: