శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్మూ లే అవుట్లో.. నూతన గృహాలని ప్రారంభించడానికి వచ్చిన మంత్రులకు స్థానిక మహిళల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. జమ్మూ లే అవుట్ లో నిర్మించిన ఇళ్లను.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. తాము ఇళ్లు నిర్మించలేని పరిస్థితిలో ఉన్నామని పలువురు మహిళలు మంత్రుల ఎదుట వాపోయారు.
ఇళ్లు కట్టకుంటే అర్ధాంతరంగా పట్టాలు వెనక్కి తీసుకుంటామని కొందరు భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులు చేసుకునే తాము.. వెంటనే ఇళ్లు ఎలా కట్టగలమని మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. మహిళలను మాట్లాడనీయకుండా అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు అడ్డుకున్నారు. స్పందించిన మంత్రి.. పట్టాలు రద్దు చేయమని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి
Plane Crash in Telangana: నల్గొండ జిల్లాలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి