శ్రీకాకుళం జిల్లా పూర్తి మండలం చిన్నలంకం మామిడి వలసలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చిన్న లంకంలో సుమారు రూ.17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం, మామిడి వలస గ్రామంలో 21.88 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్రం పనులు ప్రారంభించారు. మామిడివలసలో కొత్తగా నిర్మించి సీసీ రోడ్లు ప్రారంభించారు. వైకాపా నాయకులు ఖండపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: