ఎస్సీ కులాలకు సంబంధించిన భూములను వైఎస్‌ఆర్ నవశకం పేరిట తీసుకోవద్దంటూ ఎస్సీ శాసన సభా కమిటీ ముందు ఎస్సీ సంఘాల నేతలు గొడవకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన వినతుల స్వీకరణ రసాభాసగా మారింది. ఎస్సీ శాసన సభా కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు సమక్షంలో టేబుల్స్‌పై ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని ఛైర్మన్ గొల్ల బాబూరావు చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
'ఎస్సీల భూములను తీసుకోవడానికి వీల్లేదు' - భూసేకరణను వ్యతిరేకిస్తూ గొడవ
తమ వారి భూములను ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదంటూ ఎస్సీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఎస్సీ శాసన సభా కమిటీ వినతుల స్వీకరణ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది.
!['ఎస్సీల భూములను తీసుకోవడానికి వీల్లేదు' Leaders of SC associations have raised concerns over land acquisition in srikakulam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6127894-962-6127894-1582113460425.jpg?imwidth=3840)
Leaders of SC associations have raised concerns over land acquisition in srikakulam
'ఎస్సీల భూములను తీసుకోవడానికి వీల్లేదు'
ఎస్సీ కులాలకు సంబంధించిన భూములను వైఎస్‌ఆర్ నవశకం పేరిట తీసుకోవద్దంటూ ఎస్సీ శాసన సభా కమిటీ ముందు ఎస్సీ సంఘాల నేతలు గొడవకు దిగారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన వినతుల స్వీకరణ రసాభాసగా మారింది. ఎస్సీ శాసన సభా కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు సమక్షంలో టేబుల్స్‌పై ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని ఛైర్మన్ గొల్ల బాబూరావు చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి: సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
'ఎస్సీల భూములను తీసుకోవడానికి వీల్లేదు'