శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు... కోర్టు ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. నిమ్మాడ గ్రామంలో న్యాయవాది ఇప్పిలి తాత పై కోటబొమ్మాలి పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా వారు విధులు బహిష్కరించారు. విధి నిర్వహణలో భాగంగా బార్ అధ్యక్షుడు ఇప్పిలి తాత... కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వెళ్లగా 10 గంటల పాటు అక్రమంగా నిర్బంధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనపై సీఐ, ఎస్ఐలు దురుసుగా వ్యవహరించారని చెప్పారు. ఈ మేరకు పోలీసుల తీరుపై పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్టు న్యాయవాదులు తెలిపారు.
ఇదీ చదవండి: బడ్జెట్ ప్రసంగం: టీమ్ఇండియాపై ఆర్థికమంత్రి ప్రశంసలు