ఎన్ని కేసుల పెట్టినా భయపడేది లేదు : కూన రవికుమార్ సభాపతి తమ్మినేని సీతారాం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెదేపా నేత కూన రవికుమార్ స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత అజ్ఞాతం వీడిన ఆయన... హైకోర్టు ముందస్తు బెయిల్‌తో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వచ్చారు. సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రవికుమార్‌తో పాటు మరో 11 మందిపై గత నెల 26వ తేదీన కేసు నమోదైంది. ఆమదాలవలస పోలీసుస్టేషన్‌లో గత నెల 28వ తేదీన 10మంది లొంగిపోయారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్న రవికుమార్.. ముందస్తు బెయిల్ కోసం శ్రీకాకుళం జిల్లా కోర్టును ఆశ్రయించారు. కానీ జిల్లా కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. తర్వాత ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 24వ తేదీన రవికుమార్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో అజ్ఞాతం వీడిన రవికుమార్..ఆమదాలవలన వచ్చారు. ఆయనకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆమదాలవలసలో మట్లాడిన రవికుమార్...తెదేపా కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా తమ్మినేని సీతారాం ప్రవర్తన ఉందని ఆరోపించారు. సభాపతి, ఆయన కుమారుడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి :
ఆజ్ఞాతం వీడిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్