అమరావతి రైతుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కూన రవికుమార్ స్పష్టం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా జిల్లాలోని ఆముదాలవలసలో ఆయన ఆధ్వర్యంలో ఆదివారం తెదేపా శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులు దీక్ష చేపట్టి 300 రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని కూన రవికుమార్ తెలిపారు.
ఇదీ చదవండి