శ్రీకాకుళం జిల్లా జమ్ము కూడలి వద్ద ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి రాజాం వైపు తరలిస్తున్న నిషేధిత ఖైనీ, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు 91 వేల రూపాయలు ఉంటుందని నరసన్నపేట ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గుట్కా ప్యాకెట్లతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.
ఇదీ చదవండి: