ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 19మంది వలసకూలీలను... శ్రీకాకుళం జిల్లా బూర్జ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్‌కు చెందిన వీరు... జాతీయ రహదారి పనుల నిమిత్తం జిల్లాకు వచ్చినట్లు చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిపివేయడంతో వీరంతా స్వస్థలాలకు కాలినడకన బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా అధికారులు వీరిని అడ్డుకొని... 20రోజులుగా బూర్జ క్వారంటైన్లో ఉంచారు. ఈ వలస కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ప్రత్యేక వాహనంలో వీరిని జార్ఖండ్ పంపిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: