శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పకీర్ సాహెబ్ పేట పోలింగ్ కేంద్రంలో ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీశాయి. వైకాపా ఏజెంట్లు దొంగ ఓట్లు వేయిస్తున్నారని తెదేపా శ్రేణులు ఆరోపించాయి. తమ ఏజెంట్.. ఈ ఘటనను అడ్డుకున్న కారణంగా వైకాపా కార్యకర్తలు దాడి చేశారని తెదేపా నేతలు చెప్పారు. ఇందుకు నిరసనగా పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు.
ఎంపీటీసీ అభ్యర్థి ధనలక్ష్మి భర్త కిల్లి సిద్ధార్థ్ ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు నిలుపుదల చేసి దొంగ ఓట్లు వేయిస్తున్నారని సమాచారం వచ్చిన కారణంగానే.. తాము పోలింగ్ కేంద్రం వద్ద చేరుకున్నామని వివరణ ఇచ్చారు. ఇంతలోపే తమ ఏజెంట్ రాజేష్‌పై దాడి చేశారని మండిపడ్డారు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: