శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలిలో ఉన్న కేఎఫ్సీలో ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల నాణ్యతపై అందుతున్న ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేశామని అధికారులు తెలిపారు.
ఆహార పదార్థాల నమూనాలు సేకరించామని.. వాటి పరీక్షా ఫలితాలు వచ్చిన తరువాతే చర్యలు తీసుకుంటామని వివరించారు. పట్టణంలోని అన్ని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆహార పదార్ధల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
భార్యను హతమార్చిన భర్త.. విచారణలో పోలీసుల దృష్టికి షాకింగ్ విషయాలు..!