శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రం పురం గ్రామంలో ఉపాధి హామీ పనులను గ్రామానికి చెందిన పలువురు అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తమ వద్ద తీసుకున్న భూములకు సరైన సొమ్ము చెల్లించలేదని భూయజమానులు నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఎకరాకు 15 లక్షలు ఇస్తామని చెప్పి 11 లక్షలే ఇచ్చారని వారంతా ఆరోపించారు. నిరసనగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు అడ్డుకొని వేతనదారులను వెనక్కి పంపారు. అధికారులు తమ న్యాయం చేసే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...జనభేరి సభకు వెళ్లకుండా నేతల గృహనిర్బంధాలు