ఒడిశా నుంచి విశాఖపట్టణానికి కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మహేంద్రతనయ వంతెన సమీపంలో ఈ దుంగలను పట్టుకున్నట్లు పాతపట్నం సీఐ రవిప్రసాద్ పేర్కొన్నారు. నిందితులను పట్టుకుని విచారణ చేపట్టగా...విశాఖపట్నం నుంచి ధిల్లీకి అక్రమంగా తరలిస్తున్నట్లు వారు పేర్కొన్నారని సీఐ తెలిపారు. అక్రమ రవాణాలో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా... వారి నుంచి మరింత సమాచారం సేకరించి కేసు నమోదు చేస్తామని...పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గ్రామీణులకు సేవ చేస్తాం: యువ ఐపీఎస్ల అంతరంగం