![అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8359960_380_8359960_1597019959517.png)
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఖైనీ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. బెజ్జిపురం గ్రామానికి చెందిన ఎన్.సూర్యరావు ఇంట్లో వీటిని నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుని నుంచి 23, 310 రూపాయలు విలువ చేసే ఖైనీ, గుట్కా, డిలాక్స్ తదితర ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని హెచ్సీ రామారావు తెలిపారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి