శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబును ఈ రోజు ఉదయం రామయ్య పుట్టుగలోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి తెదేపా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అరెస్ట్‌పై... నిరసన తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఈ మేరకు పోలీసులు ముందస్తుగా అశోక్ బాబును గృహ నిర్భంధం చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి.. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. అభివృద్ధిని పక్కన పెట్టిన ప్రభుత్వం.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం బాధాకరమని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి: