ETV Bharat / state

మంత్రి కృష్ణదాస్​పై ఫిర్యాదు నిరాకరణ.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత - నరసన్నపేట స్టేషన్ వద్ద తెదేపా వైకాపా గొడవ

మంత్రి కృష్ణదాస్‌పై ఫిర్యాదు కోసం వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా శ్రేణులు భారీగా స్టేషన్​కు తరలివచ్చిన కారణంగా.. కాసేపు గందరగోళం నెలకొంది. తెదేపా నేతల ఆందోళలనతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత
author img

By

Published : Oct 3, 2020, 6:44 PM IST

Updated : Oct 3, 2020, 10:41 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పోలీసుస్టేషన్‌ ఎదుట తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి ధర్మాన కృష్ణదాసుపై ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం నేతలు పెద్దఎత్తున కార్యకర్తలతో స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు . తమ ఫిర్యాదు పోలీసులు తీసుకోవడం లేదంటూ ఎంపీ రామ్మోహన్‌నాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు, కూన రవికుమార్ పోలీసుస్టేషన్ ఎదుట భైఠాయించారు. దీనికి ప్రతిగా వైకాపా కార్యకర్తలు సైతం పెద్దసంఖ్యలో స్టేషన్ వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా నేతల ఆందోళలనతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు.

తెదేపానే అంతం చేయటమే అజెండా

తెదేపాను అంతం చేయటమే అజెండాగా ముఖ్యమంత్రి జగన్ పాలనను కొనసాగిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. దౌర్జన్యాలు అరచకాలతో తెదేపా పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిందని ఆక్షేపించారు. తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కృష్ణదాసు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రులు అసహనంతో ఉన్నారు

జగన్ పాలనలో మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని తెదేపా నేత కూన రవికూమార్ విమర్శించారు. మంత్రులు సమర్థతతో పని చేయలేక వారి అసహనాన్ని ప్రజలపై, ప్రతిపక్షాలపై చూపిస్తున్నారని మండిపడ్డారు. రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

మంత్రి కృష్ణదాస్​పై ఫిర్యాదు నిరాకరణ.

ఇదీచదవండి

కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు

Last Updated : Oct 3, 2020, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.