ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఉప్పొంగిన వాగులు.. స్తంభించిన జనజీవనం

శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. ప్రజలు రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఉప్పొంగిన వరద నీరు తప్ప ఇంకేం కనిపించడంలేదు.

శ్రీకాకుళంలో వర్షాలు
author img

By

Published : Oct 24, 2019, 11:05 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లావేరు మండలంలోని బుడుమూరు పెద్ద గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించి 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బెజ్జిపురం గ్రామ సమీపంలో ఉన్న దేవునివానిచెరువు నుంచి వరద నీరు ఉద్ధృతంగా గ్రామంలోకి ప్రవహిస్తుంది. పాతరౌతుపేట సమీపంలో ఉన్న చిట్టగెడ్డ ప్రవాహానికి రహదారి కోతకు గురైంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నియోజకవర్గంలో 2 వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలైందనీ.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు విజ్ఞప్తి చేశారు.

పాలకొండ నుంచి పార్వతీపురం అంతర్రాష్ట్ర రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది మోకాలు లోతున నీరు ప్రవహించి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రాంతాల్లో గెడ్డలు పొంగి ప్రవహించి బాసూరు, బీపీ రాజుపేట, తుమరాడ, టమోటాపల్లి గ్రామాల పరిధిలోని వెయ్యి ఎకరాల్లో పంట నీటమునిగింది.

ఈ వర్షాలకు జిల్లాలోని ఇచ్చాపురంలో ఉన్న బాహుదా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ఒడిశాలో కురిసిన వర్షాలకు నీరు ఇచ్చాపురం వైపు వస్తోంది. పద్మాపురం గెడ్డ, భీమసముద్రం గెడ్డల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. వీటి సమీపంలో ఉన్న ఇనెస్పేట గ్రామానికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బూర్జ మండలం లక్కుపురం గ్రామంలోకి వరదనీరు వచ్చి చేరింది.

శ్రీకాకుళంలో వర్షాలు

ఇవీ చదవండి..

వైకాపా తప్పుడు కేసులు పెడుతోంది: వల్లభనేని వంశీ

Intro:AP_SKLM_21_24_Bharivarshaalu_Uppogina_Geddalu_SthabincinaRakapokalaku_AVBB_AP10139

భారీ వర్షం.. ఉప్పొంగిన గెడ్డలు.. స్తంభించిన రాకపోకలు
* నీటమునిగిన వందలాది ఎకరాలు పంటలు
* ఆందోళనలో అన్నదాతలు

శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రజలు రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఉప్పొంగిన వరద నీరు తప్ప ఇంకేం కనిపించలేదు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు రణస్థలం ఎచ్చెర్ల జి.సిగడాం మండలాల్లో వరదలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. లావేరు మండలం లో ఉన్న బుడుమూరు పెద్ద గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దరొంపివలస, రాయిలింగారిపేట, నేతేరు, లక్ష్మీపురం, నేదురుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. బెజ్జిపురం గ్రామ సమీపంలో ఉన్న దేవునివానిచెరువు నుంచి వరద నీరు ఉధృతంగా గ్రామంలో నుంచి ప్రవహిస్తుంది. అదపాక గ్రామం సమీపంలోని ఉన్న గెడ్డ ఉదృతంగా ప్రవహించడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు పాతరౌతుపేట సమీపంలో ఉన్న చిట్టగెడ్డ ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో రహదారి కోతకు గురికావడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. నియోజకవర్గంలో రెండు వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దీంతోపాటు పత్తి, మొక్కజొన్న, తదితర వాణిజ్య పంటలు సర్వనాశనం అయ్యాయి. ప్రస్తుతం పంటలు వర్షాలకు నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Body:భారీ వర్షం

Conclusion:భారీ వర్షం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.