శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని మండాపొలం కాలనీలో మోకాలు లోతు నీటిలో రాకపోకలు చేస్తున్నారు. భవాని నగర్, శ్రీనివాస నగర్ లో నీరు నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నీటిని మళ్లించే ఏర్పాట్లు చేయకపోవడంపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి