శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంలోనూ విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేపట్టి విద్యుత్తు పునరుద్ధరించారు.
ఒడిశాలో వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదులు పొంగే ప్రమాదం ఉందని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. గ్రామాల్లో రెవెన్యూ పంచాయతీ అధికారులు ఉండాలని ఎంపీడీవో వెంకటరాజు సూచించారు. పూరి గుడిసెల్లో ఉన్నవారు తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ఇదీ చదవండి: నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం