Variety Gift: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో పెళ్లి చేసుకున్న ఓ కొత్త జంటకు మిత్రుల నుంచి సరికొత్త బహుమతి అందింది. సాధారణంగా.. బంగారం, వెండి ఆభరణాలు, దుస్తులు ఇతర కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ.. సురేష్, నందిని అనే కొత్త దంపతులకు వారి స్నేహితులు విసనకర్రలు గిఫ్టుగా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని.. నూతన దంపతులకు సరదాగా ఈ బహుమతి ఇచ్చినట్లు మిత్రులు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: 'అవసరమైతే పస్తులుంటాం కానీ.. బీసీలెవ్వరూ ఆత్మాభిమానాన్ని చంపుకోరు'