ETV Bharat / state

మెగాస్టార్​పై గుండెలనిండా అభిమానం.. ప్రేమను చాటేందుకు అడ్డురాని వైకల్యం! - srikakulam district latest news

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు రకరకాలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి తమ ప్రేమను చాటుకున్నారు. కానీ.. వారందరికీ మించి.. అన్నంత స్థాయిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ దివ్యాంగులు.. చిరుకు స్పెషల్ గా విషెస్ చెప్పారు. మెగాస్టార్ పై తమ అభిమానాన్ని తెలియజేసేందుకు.. వైకల్యం కూడా అడ్డురాదని నిరూపించారు. ఆ లవ్, ఎఫెక్షన్ ఎంత ఉన్నతంగా ఉన్నాయో.. మీరూ చూడండి.

swapna
స్వప్న
author img

By

Published : Aug 23, 2021, 10:59 AM IST

మెగాస్టార్​కు వినూత్నరీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగులు

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం నాయరాలు వలస గ్రామానికి చెందిన దివ్యాంగురాలు కొవ్వాడ స్వప్న మెగాస్టార్ చిరంజీవికి వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. చిన్నతనంలోనే రెండు చేతులూ కోల్పోయిన స్వప్న.. చిరంజీవి అభిమానులు సహకారంతో గాజుల షాపు పెట్టుకుంది. ఈ క్రమంలో చిత్రకారిణిగానూ ప్రతిభను పెంచుకున్న ఆ అమ్మాయి.. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అద్భుతాన్ని సృష్టించింది. నోటితో మెగాస్టార్ చిత్రాన్ని గీసి శభాష్ అనిపించుకుంది. అలాగే.. తన దివ్యాంగులైన తన స్నేహితులు మరో ముగ్గురితో కలిసి.. చిరు పాటలకు స్టెప్పులతో సందడి చేసింది. మెగాస్టార్ కు హ్యాపీ బర్త్ డే తెలియజేసింది.

చిరంజీవిని కలిసి 'యువత' నేతలు

చిరంజీవి యువత తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తిపూడి బాబి.. సూరంపాలెం గ్రామ ఉప సర్పంచి బాలు హైదరాబాదులోని చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరు బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా చిత్రించిన పటాన్ని కానుకగా అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.