శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణం వలస గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ గండ్రటీ కేసరి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పది రకాల నిత్యావసర సరకులతో కూడిన కిట్‌ను 250 కుటుంబాలకు అందించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు తన వంతు సాయంగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరాన్ని పాటించి, కరోనా వైరస్ నివారణకు కృషి చేయాలన్నారు.
ఇదీ చూడండి: సీబీఐ చేతికి తండ్రి, కొడుకుల లాకప్‌డెత్ కేసు