ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జగనన్న కాలనీలకు శంకుస్థాపన

రాష్ట్రవ్యాప‌్తంగా నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. తిమ్మాపురంలో 305 ఇళ్లను శాసనసభాపతి తమ్మినేని సీతారాం లబ్ధిదారులకు అందజేశారు. నగరిలో జగనన్న కాలనీల ఇళ్ల శంకుస్థాపనలో కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు.

grandly-celebrations-of-jagananna-colonies-in-various-places-of-andhrapradhesh
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జగనన్న కాలనీలకు శంకుస్థాపన
author img

By

Published : Jul 1, 2021, 10:52 PM IST

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురంలో సామూహిక ఇళ్లకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. 305 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. చిత్తూరు జిల్లా నగిరిలో జగనన్న ఇళ్ల శంకుస్థాపనలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా పక్కా ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ శివారు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల కాలనీలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. జగనన్న కాలనీలు ఆదర్శ కాలనీలగా మారతాయని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ శంకుస్థాపన చేశారు. నందిగామ నగర పంచాయతీ పరిధి మొగిలిచర్ల సమీపంలో జగనన్న కాలనీలకు నగర పంచాయతీ ఛైర్పర్సన్ వరలక్ష్మి శంకుస్థాపన చేశారు. తొలి విడతలో 441 మందికి ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఇదీచదవండి.

అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న మట్టితవ్వకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.