Students became ill health after had midday meals: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం తిన్న వెంటనే 95 మంది విద్యార్థులంతా వాంతులు చేసుకున్నారు. దీంతో వారందరినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులంతా కలిసి సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మధ్యాహ్నం భోజనంలో పెట్టిన కోడిగుడ్లు తినడం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి : Boy died by fell under the bus: అన్న బడికి వెళ్తుంటే సాగనంపాడు..కానీ అంతలోనే