శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోష్ఠ గ్రామంలో శ్రీ కృష్ణ చైతన్య మఠం ఆధ్వర్యంలో గోమాత ఆవిర్బావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత గోశాలలో ఉన్న ఆవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగన్నాథ స్వామి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పూజల్లో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. కృష్ణ భగవానుడిని స్మరిస్తూ భజన కార్యక్రమాలు చేపట్టారు. గోసాల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చూడండి: ద్రౌపదీ సమేత ధర్మరాజుకు పాలాభిషేకం..గోమాత ఊరేగింపు