శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్నాన సురేష్ అనే వ్యాపారి సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశతో గుట్కా ప్యాకెట్లు తెచ్చి ఇతర జిల్లాలకు తరలించేవాడు. గుట్కాను ఒడిశా నుంచి అక్రమంగా వీరఘట్టం తరలిస్తుండగా... పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందిడిని అరెస్టు చేశారు. 10లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి