అందరూ తలో పని చేశారు... మూడు గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరించారు
అందరూ సహకరించారు... 3గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరణ - srikakulam
మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కంబర ప్రాథమిక పాఠశాలలో కేవలం మూడు గంటల వ్యవధిలోనే మహాత్ముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అందరి సహకారంతో ఈ కార్యాన్ని పూర్తి చేయగలిగారు.
![అందరూ సహకరించారు... 3గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4631530-1056-4631530-1570040131203.jpg?imwidth=3840)
అందరూ తలో పని చేశారు... మూడు గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరించారు
అందరూ తలో పని చేశారు... మూడు గంటల్లోనే గాంధీ విగ్రహం ఆవిష్కరించారు
Intro:శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం లోని వీరఘట్టం మండలం కంబర ప్రాథమిక పాఠశాలలో మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్బంగా గాంధీ విగ్రహాన్ని యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన జీ. మోహన రావు రాజమహేంద్రవరం నుంచి గాంధీ విగ్రహాన్ని తీసుకువచ్చారు. మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు లలిత కుమారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు. విద్యార్థులు సైతం ఇసుక, ఇటుకలను అందజేసి సహకరించారు. 3గంటల కాల వ్యవధిలో విగ్రాహాన్ని స్థాపించి ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయుడు రాంబాబు పనులను పర్యవేక్షించారు.Body:PalakondaConclusion:8008574300