శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామంలో పాముకాటుతో 5 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వెంకట్రావు, చంద్రకళ దంపతుల కుమారుడైన కాలెపు నవనీత్( 5) ఆదివారం ఇంటి సమీపంలోని పెరట్లో ఆడుతుండగా పాము కాటు వేసింది. బాలుడిని తల్లిదండ్రులు వెంటనే రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. ఏకైక కుమారుడు మృతి చెందటంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి