శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం , రణస్థలం మండలం దోనుపేట గ్రామానికి చెందిన మైలిపల్లి పెంటయ్య(59) చేపల వేటకు వెళ్లి సముద్రంలో మృతి చెందాడు. ఎప్పటి లానే తన పడవను తీసుకొని తెల్లవారుజామున సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. కొంత దూరం వెళ్లే సరికి అలలు ఉధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడి.. పెంటయ్యను ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతినికి భార్యా, నలుగురు పిల్లలు ఉన్నారు. పెంటయ్య మృతితో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
![fishermen died at srikakulam while went fishing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-sklm-21-29-chepalu-vetaku-velli-matyakaarudu-mruti-av-ap10139_29042020091401_2904f_1588131841_925.jpg)
ఇదీ చదవండి... 'రోగ నిరోధక శక్తి అతి స్పందనను కట్టడి చేస్తే మరణాలు తగ్గుతాయ్'