శ్రీకాకుళం జిల్లాలో హరిత దీపావళి చేసుకుందామని అధికారులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రతీ ఏటా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూడివలసలోని అనుమతి ఉన్న దుకాణంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలు గాలికొదిలేసి...టపాసుల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఈ మూడు రోజులు కొవిడ్ నిబంధనలు పాటించలేమని దుకాణ యజమాని తేల్చి చెప్పారు.
రెవెన్యూ, పోలీసు శాఖలు చూసిచూడనట్లు విడిచిపెట్టేసారని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. కుటుంబసభ్యులతో కలసి సంతోషంగా జరుపుకొనే పండుగ కావడంతో ఎక్కువ ధరలు ఉన్నా.. కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. యంఆర్‌పీ ధరలు సక్రమంగా లేకపోవడంతో ఇష్టానుసారంగా అమ్మకాలు జరుగుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.
ఇదీ చదవండి: