శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయి. ఇంట్లోని బంగారం, డబ్బులు, ధాన్యం, బట్టలు ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల ఆస్తి నష్టం కలిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు నక్క సూర్యనారాయణ వేడుకుంటున్నాడు.
ఇదీ చదంవడి: 'తెదేపా ఓటింగ్ పెరిగింది.. మరలా అధికారంలోకి వస్తాం'