శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం బంజీరు పేట గ్రామ సమీపంలోని సాయి వర్ధన్ జూట్ ప్రైవేట్ లిమిటెడ్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మోటారులో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కొన్ని పురితాళ్ల బస్తాలకు నిప్పంటుకున్న కారణంగా.. పొగలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన కార్మికులు మిగిలిన వాటికి మంటలు వ్యాపించకుండా బయటకు తరలించారు.
టెక్కలి అగ్నిమాపక సిబ్బంది.. పరిశ్రమకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ. 70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని చెబుతుండగా, రూ.5 లక్షల వరకు నష్టం జరిగి ఉంటుందని అగ్ని మాపక సిబ్బంది అంచనా వేశారు.
ఇదీ చదవండి: