శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేసుపురంలోని రైతు కుటుంబానికి చెందిన యువకుడు సూరు ప్రసాద్ ఇస్రోలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల ఆ సంస్థ నిర్వహించిన ఎల్పీఎస్సీ టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షల్లో.. జాతీయ స్థాయిలో ఎనిమిదవ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తన ఎదుగుదల వెనుకు తల్లిదండ్రులు, నాయనమ్మ కృషి ఎనలేనిదని ప్రసాద్ తెలిపాడు. తమ ఊరి వ్యక్తి శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకు ఈసీ
గతంలో సచివాలయ ఉద్యోగాల నియామక జాబితాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని సాధించాడు. ధర్మపురం పంచాయతీలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10 తరగతి చదువుతున్న సమయంలోనూ ప్రతిభ చూపాడు. కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బీటెక్ పూర్తి చేశాడు.
ఇదీ చదవండి: కరోనాతో ‘సర్కారువారి పాట’ అసోసియేట్ డైరెక్టర్ మృతి