ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాకు తప్పిన ఫొని తుపాను ముప్పు - ఫొని

శ్రీకాకుళం జిల్లాకు పెనుముప్పు తప్పినట్లేనని జిల్లా పాలనాధికారి జె.నివాస్‌ స్పష్టం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే వరదలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఫొని తుపాను ప్రభావంపై జె.నివాస్‌ 'ఈటీవి భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సిక్కోలు జిల్లాకు తప్పిన ఫొని ముప్పు
author img

By

Published : May 3, 2019, 8:27 AM IST

Updated : May 3, 2019, 8:33 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఇంతవరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని జిల్లా పాలనాధికారి జె.నివాస్‌ తెలిపారు. విద్యుత్ స్తంభాలు కొన్ని వాలిపోయినట్లు సమాచారం వచ్చింది.. వెంటనే పునరుద్ధరిస్తామని చెప్పారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్న కలెక్టర్‌... తుపాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా బహుదా, వంశధార నదుల్లో వరదలు వస్తాయని కలెక్టర్‌ వివరించారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇసుక తవ్వకాలు... ఇతర పనులకు నదుల్లోకి వెళ్లొద్దని కోరారు. నదీ తీరంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ కంపెనీల అనుసంధానం చేశామన్న పాలనాధికారి... ఒక సంస్థ టవర్ దెబ్బతిన్నా మరో సంస్థ టవర్ ద్వారా సిగ్నల్‌కు అవకాశం కల్పించామని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగలేదని తెలిపారు.

Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తుపాను ప్రభావం కొంత మేర తగ్గింది. గురువారం ఉదయం నుంచి నిలిపివేసిన విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరణ జరగలేదు. రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు గాలుల ఉధృతి పెరగడంతో జనం భయబ్రాంతులకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ ఉదయం వరకు గడిపారు. ఆ తరవాత కొంతమేర గాలుల తీవ్రత తగ్గింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి పోయింది. టెక్కలి ఎన్టీఆర్ నగర్లో వృద్ధురాలు రంగాల అప్పమ్మ (80) చలిగాలులకు మృతి చెందింది. టెక్కలి తహశీల్దార్ కార్యాలయం వద్ద రెండు వ్యాన్ లతో నీళ్ళ ప్యాకెట్లు సిద్దం చేశారు. తుపాను పరిస్థితి పై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించారు. గురువారం సాయంత్రం నుంచి నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు ఒక్కటొక్కటిగా పునరుద్దరిస్తున్నారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Last Updated : May 3, 2019, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.