ETV Bharat / state

ఇదేం కర్మ.. జగన్ పరదాల చాటు పర్యటనలు ఎందుకు?:ఎంపీ రామ్మోహన్‌

TDP MP RAMMOHAN: మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తెచ్చారని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన "ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి" అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

TDP MP RAMMOHAN
TDP MP RAMMOHAN
author img

By

Published : Dec 2, 2022, 10:56 AM IST

MP RAMMOHAN NAIDU : కనీసం విభజన హామీలు సాధించలేని ముఖ్యమంత్రి.. మూడు రాజధానులు ఏం నిర్మిస్తారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసరాలు ధరలు, ఇతర పన్నుల పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు.

"ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి విజయవంతమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టో తయారీకి బాగా ఉపయోగపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నాం. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్నారంటే వైసీపీలో భయం మొదలైనట్లే. రేపే ఎన్నికలు పెట్టినా చంద్రబాబును గెలిపించడానికి సిద్ధం. ఎన్నికలు ఎప్పుడైనా జగన్‌ ఓటమి ఖాయం"- టీడీపీ ఎంపీ రామ్మోహన్‌

సీఎం జగన్​ పరదాలు చాటున ఎందుకు తిరుగుతారు: జగన్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఉంటే.. పరదాల చాటున ఎందుకు తిరుగుతారని.. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. జగన్‌ ఓటమి ఖాయమంటున్న రామ్మోహన్‌తో "ఈటీవీ-ఈటీవీ భారత్​" ముఖాముఖి..

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌తో ముఖాముఖి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.