ETV Bharat / state

'ఈనాడు' తోడు... సాకారమైన గూడు - హుద్​హుద్ బాధితులకు ఈనాడు ఇళ్లు వార్తలు

హుద్​హుద్ పెను తుపాను చేసిన గాయం ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది ఈ తుపాను. దీంతో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు సిక్కోలు జిల్లాలో రామోజీ గ్రూప్ గృహాలను నిర్మించి ఇచ్చింది. పూరి గుడిసెల్లో జీవించే తమకు... మంచి ఇళ్లు ఇచ్చారంటూ లబ్ధిదారులు 'ఈనాడు'కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

EENADU
EENADU
author img

By

Published : Sep 11, 2020, 6:01 AM IST

'ఈనాడు' తోడు... సాకారమైన గూడు

హుద్​హుద్ తుపానుతో నిలువ నీడ లేకుండా పోయిన బాధితులకు 'ఈనాడు' అండగా నిలిచింది. సంస్థతో పాటు ఎంతోమంది దాతలు ముందుకొచ్చి అందించిన విరాళాలతో 'ఈనాడు రిలీఫ్ ఫండ్ హుద్​హుద్​ తుపాను బాధితుల పునరావాస కాలనీ' పేరుతో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో 64 ఇళ్లను సకల సదుపాయాలతో నిర్మించింది. వాటిని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చేతుల మీదుగా గురువారం లబ్ధిదారులకు అందజేసింది.

ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు బాధితులను ఆదుకోవటంలో రామోజీ గ్రూప్ చూపే చొరవ అభినందనీయమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. నిర్మాణాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో చక్కటి ఇళ్లు కట్టించి.. నిరుపేదల కల నెరవేర్చిన రామోజీరావు స్ఫూర్తిదాయకంగా నిలిచారని టెక్కలి వైకాపా సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.

అప్పుడు విశాఖలో... ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో

హుద్​హుద్ విలయానికి సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు 'ఈనాడు' 3 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ప్రజల నుంచి విరాళాలు కోరగా పలువురు ముందుకొచ్చి 3.16 కోట్ల సాయాన్ని అందించారు. మొత్తం 6.16 కోట్ల సహాయనిధితో విశాఖపట్నం జిల్లా తండి... వాడపాలెం గ్రామంలో 80 గృహాలను నిర్మించి తుపాను బాధితులకు పంపిణీ చేసింది. తర్వాత శ్రీకాకుళం జిల్లా పాత మేఘవరం గ్రామంలో 36, ఉమ్మిలాడ గ్రామంలో 28 మొత్తం 64 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి వాటిని బాధితులకు అందజేసింది.

లబ్ధిదారులు హర్షం

2014 అక్టోబర్ 12న హుద్​హుద్ పెను తుపాను విశాఖతో పాటు శ్రీకాకుళం జిల్లానూ అతలాకుతలం చేసింది. సంతబొమ్మాళి మండలంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు, పేదల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో నిలువ నీడ కోల్పోయిన బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని 'ఈనాడు' సంకల్పించింది. ఈ మేరకు మండల పరిధిలోని పాత మేఘవరం, ఉమిలాడ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి 2016 మే 28న శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత భూసేకరణ, మౌలిక వసతుల కల్పన కోసం కొంత ఆలస్యమైంది. అనంతరం అన్ని హంగులతో, పూర్తి నాణ్యతతో 'ఈనాడు' నిర్మించింది. పక్కా రహదారులు, కాలువలు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. దీంతో లబ్ధిదారులకు ఇంటి హక్కు పత్రాలు, తాళాలను కలెక్టరు గురువారం పంపిణీ చేశారు. ఇళ్లను చూసిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. పక్కా గూడు నిర్మించి ఇచ్చిన 'ఈనాడు'కు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి 'ఈనాడు' శ్రీకాకుళం యూనిట్ ఇన్​ఛార్జి డీవీ రమణ, సంతబొమ్మాళి తహసీల్దారు ఎస్​.రాంబాబు, పలువురు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.