ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు సిక్కోలు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌కు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి ఎదుట వైద్యులు నిరసన చేశారు. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యులు గంటపాటు విధులకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు అమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి... బ్రెగ్జిట్‌పై ఐరోపా సమాఖ్య రాజీపడాల్సిందే: బ్రిటన్