ETV Bharat / state

'కార్యకర్తలు చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం' - tammineni seetaram latest news

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా కార్యకర్తలు చెప్పినవారినే గ్రామాల్లో వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

Dharmana Krishna Das sensational comments on Volunteers
'కార్యకర్తలు చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం'
author img

By

Published : Feb 25, 2020, 8:12 PM IST

'కార్యకర్తలు చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం'

వైకాపా కార్యకర్తలు చెప్పినవారినే గ్రామాల్లో వాలంటీర్లుగా నియమించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. కార్యకర్తలు వాలంటీర్లతో కలిసి పనిచేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం ఎత్తిపోతల పథకానికి సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ శంకుస్థాపన చేశారు. రెల్లిగెడ్డపై 8 కోట్ల 56 లక్షల నిధులతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నట్టు తమ్మినేని తెలిపారు.

లైదాం, కొంచాడ, రాపాక, వాండ్రంగి, కొల్లిపేట, పొందూరు గ్రామాలకు చెందిన 12 వందల 50 మంది రైతులకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సభాపతి వివరించారు. లైదాం ఎత్తిపోతల పథకం వల్ల 1,174 ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు. ఇసుక విషయంలో తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ప్రజా జీవితం నుంచి వైదొలగడానికి సిద్ధమేనని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:

'అమరావతిలో ఉద్యమం చేసేది రైతులు కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.