తెలుగు భాషకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని.. అయితే ఆంగ్ల మాధ్యమం అవసరమని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మార్వో కార్యాలయంలో శనివారం వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంగ్ల మాధ్యమం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. తాను తెలుగు మాధ్యమంలో చదువుకొని పడుతున్న ఇబ్బందులను వివరించారు.
ప్రతిపక్ష నేత చీటికీ.. మాటికీ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకొని, తెలుగు భాష అవసరం గురించి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : ప్రాణాలకు తెగించి.. గర్భిణికి చేయూత