పరిశ్రమల ఏర్పాటుతో తమ ప్రభుత్వం యువతకు స్థానికంగా 75% ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత తమ నైపుణ్యాన్ని పెంచుకుని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: