శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం..శ్రీ రామవలస గ్రామ సమీపంలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు 35 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి శవపరీక్ష నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహ మూర్తి తెలిపారు.
ఇదీ చూడండి