శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో కరోనా అనుమానిత కేసు నమోదు అయ్యింది. 60 ఏళ్ల వృద్ధునికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే అనుమానిత వృద్ధుని ఇంటికి పలాస తహసీల్దార్ మధుసూదన్ చేరుకొని వివరాలు సేకరించారు. వృద్ధుడని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. మిగిలిన కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేసి పరీక్షలు చేస్తున్నారు.
ఇదీ చూడండి దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు